దేవరకద్ర: సీనియర్ జర్నలిస్ట్ రాములు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే...
భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాములు గురువారం రాత్రి మరణించాడు.విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాములు ఇంటికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి పూలమాలలు వేసి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరారు అంతేకాకుండా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.