సిరివెళ్ల లో రాంగ్ రూట్లో వెళ్తున్న బస్సులపై చర్యలు తీసుకోవాలి
నంద్యాల నుంచి ఆళ్లగడ్డ వైపు వెళ్తున్న బస్సులు సిరివెళ్లలోని హబీదడాబా నుండి రాంగ్ రూట్లో వెళ్తున్నాయని స్థానికులు తెలిపారు, ఇదివరకే సిరివెళ్ల మెట్ట వద్ద ప్రైవేటు బస్సు లారీ ఢీకొని ముగ్గురు ప్రాణాలను కోల్పోయిన విషయం విధితమే, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నా ఆర్టీసీ బస్సులు రోజు రాంగ్ రూట్ లో వెళ్లడం ఎంతవరకు సమంజసం అని పలువురు బుధవారం ప్రశ్నిస్తున్నారు, వీటిపై అధికారులు చర్య తీసుకోవాలని కోరారు