ప్రొద్దుటూరు: వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నాం: ఎంపీ. వైయస్. అవినాష్ రెడ్డి
Proddatur, YSR | Nov 23, 2025 ప్రొద్దుటూరు వైసీపీ నియోజకవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీ వైఎస్.అవినాష్ రెడ్డి హాజరయ్యారు.ఎంపీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని.అందుకే వార్డు స్థాయి నుంచి గ్రామ స్తాయి, మండల స్తాయి, నియోజక వర్గ స్తాయిలో సంస్థాగత కమిటీల ఏర్పాటు చేశారని చెప్పారు.వైసీపీ చేసిన మంచి పనులు. చెప్పడానికి ప్రతి కమిటీకి ఒక సోషల్ మీడియా ఏర్పాటు చేసి వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నాం అన్నారు.వచ్చే రోజుల్లో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తించి, ప్రాధాన్యత ఇస్తాం అని ఎంపీ వైఎస్.అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.