ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : స్టేషన్ ఘన్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం 1గంటకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రితో పాటు పరిసరాలను పరిశీలించి, ప్రజలకు వైద్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని బయోమెట్రిక్ ను అందుబాటులోకి వెంటనే తీసుకురావాలని ఆదేశించారు. ప్రత్యేక వైద్యులు వారి సేవలను అందించి పేద వర్గాలకు చికిత్స పట్ల శ్రద్ధ చూపాలన్నారు. ఆసుపత్రిలో తాగునీరు, విద్యుత్, సానిటేషన్ పనుల పట్ల అలసత్వం వహించరాదన్నారు.