ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : ఫతేపూర్ గ్రామం వద్ద బస్సు- ద్విచక్ర వాహనం ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు
చిలుపూర్ మండలం ఫతేపూర్ గ్రామ శివారు దుర్గమ్మ ఆలయం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టిసి బస్సు బుధవారం ఉదయం 9 గంటలకు ఢీకొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్టేషన్ ఘన్ పూర్ నుండి ఫతేపూర్ గ్రామానికి ఆర్టిసి బస్సు బుధవారం ఉదయం వెళుతున్నది. ఫతేపూర్ గ్రామ సమీపంలోని దుర్గమ్మ ఆలయం వద్దకు రాగానే ఫతేపూర్ గ్రామానికి చెందిన గుగులోతు మేఘ్య, చందర్, రాజకుమార్ లు మోటార్ సైకిల్ పై స్టేషన్ ఘన్ పూర్ లో కూలీ పనులు చేసేందుకు వెళుతున్నారు. దుర్గమ్మ గుడి సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ఆర్టిసి బస్సు మోటార్ సైకిల్ పై వెళ్తున్న వారిని ఢీకొన్నది. ఈ ఘటనలో మేగ్య,చందర్, రాజ్ కుమార్ లో కుడి కాళ్ళు విరిగాయి