సంతనూతలపాడు మండలం ఎండ్లూరు డొంకలో కనుమ పండుగ సందర్భంగా మహిళలకు శుక్రవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలలో పాల్గొనేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలు... రకరకాల రంగవల్లులతో ముగ్గులను అందంగా తీర్చిదిద్దారు. న్యాయ నిర్ణయితలు బాగా ముగ్గులు వేసిన మహిళలను గుర్తించి వారికి బహుమతి ప్రధానం చేశారు. ముగ్గుల పోటీలు సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.