అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట హైవే వద్ద శనివారం ఆరున్నర నుంచి 8:30 వరకు అనంతపురం రూరల్ టిడిపి నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షుడు నారాయణస్వామి కుమ్మర రామాంజనేయులు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కించపరిచే విధంగా మాట్లాడిన అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ అంబటి రాంబాబు చిత్రపటాలను దహనం చేయడం జరిగిందని అంబాటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అనంతపురం రూరల్ టిడిపి నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలంతా పాల్గొన్నారు.