కణేకల్లు మండల కేంద్రంలో తాళం వేసిన ఇంటిలో నగలు, నగదు చోరీ చేసిన దొంగలను పట్టుకుంటామని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలియజేశారు. ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ కుటుంబం హైదరాబాద్ కు వెళ్లారని, తిరిగి వచ్చేసరికి బంగారు, వెండి నగలు, నగదు చోరీకి గురైనట్లు పిర్యాదు చేశారన్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరించామన్నారు. అతి త్వరలోనే దొంగలను పట్టేస్తామని చెప్పారు.