దుబ్బాక: హబ్సీపూర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి హబ్సీపూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం అక్బర్ పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన చీమిడి బాల్రాజ్(45) అనే మిషన్ భగీరథ ఉద్యోగి.. ఆదివారం రాత్రి హబ్సీపూర్ నుండి రామాయంపేట వైపు జాతీయ రహదారిపై బైక్ ఆపి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా బాల్రాజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని భార్య సువర్ణ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.