గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం గ్రామంలో మద్యం మత్తులో తండ్రిపై కొడుకు దాడి
ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం గ్రామంలో ఆదివారం రాత్రి ఓ కుమారుడు మద్యం మత్తులో తండ్రిపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు వివరాలు మేరకు.. కొడుకు కమలేష్‌కు మద్యం అలవాటు తీవ్రంగా ఉండడంతో తరచూ తండ్రి చెంగారెడ్డితో డబ్బుల విషయం మీద గొడవలు జరిగేవి. ఇదే తరహా ఆదివారం గొడవ జరగడంతో తండ్రి పై కొడుకు దాడి చేయడంతో తండ్రి స్పృహ కోల్పోయాడు. స్థానిక చిత్తూర్ ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు.