గిద్దలూరు: అర్ధవీడు మండలం వెలగలపాయ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట రాములు అదృశ్యం, పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయ గ్రామానికి చెందిన వెంకట రాములు డిసెంబర్ 26 నుంచి కనిపించడం లేదు. వెంకట రాములు మార్కాపురంలోని గౌతమ్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కంభంలోని మేనమామ వద్ద ఆరోగ్యం బాగాలేక 14 రోజుల నుంచి ఉంటున్న వెంకట రాములు డిసెంబర్ 26వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాములు కోసం ఇప్పటికే పలు ప్రాంతాలలో అన్వేషించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరన్నా వెంకట రాములు ని గుర్తిస్తే 8523880282 / 9346151302 నంబర్లను సంప్రదించి సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.