కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు కనిగిరి మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ శుక్రవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేనిచోట్ల వాటిని గుర్తించి వాటి నిర్మాణ పనులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కనిగిరి పట్టణ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్, ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.