ఆత్మకూరు పట్టణ శివారులోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలోని ముంతాజ్ హోటల్లో గుర్తుతెలియని దుండగులు భారీ దొంగతనానికి పాల్పడ్డారు,హోటల్ వెనుక గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు బిర్యానీ డేక్షలు, హలీం పాత్రలు సహా రాగి, ఇత్తడి, స్టీలు సామగ్రిని ఎత్తుకెళ్లారు. దొంగిలించిన వస్తువుల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని యజమాని మక్బుల్ భాష తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు,