ధర్మపురి: ఇందిరమ్మ కాలనీ సమీపంలోని టెంట్ హౌస్ గోడౌన్ లో అగ్నిప్రమాదం, సుమారు 10 లక్షలకు పైగా ఆస్తి నష్టం
ధర్మపురిలోని నక్కల పేట్ రోడ్డు ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ఓ టెంట్ హౌస్ గోడౌన్ లో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో డెకరేషన్ మెటీరియల్, ప్లాస్టిక్ కుర్చీలు, టెంట్ పూర్తిగా దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిలినట్లు యజమాని వాపోయాడు