జైశ్రీమ్ అన్న నినాదాలతో నగరం దద్దరిల్లింది. శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ
Anantapur Urban, Anantapur | Mar 27, 2026
జైశ్రీమ్ అన్న నినాదాలతో అనంతపురం నగరం దద్దరిల్లింది. శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు దగ్గుపాటి, ఎంఎస్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వారు పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాల మధ్య ఎమ్మెల్యే దగ్గుపాటి బైక్ ర్యాలీని ప్రారంభించారు. తెల్లని వస్త్రాలు, కాషాయం తలపాగాతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేలాది మంది యువకులు జై శ్రీరామ్ అంటూ నగరమంతా ద్విచక్రవాహనాల్లో ప్రదర్శనలు నిర్వహించారు.