నరసరావుపేట విద్యుత్ కార్యాలయం ఎదుట సీపీఐ నేతలు ఆందోళన
నరసరావుపేటలో సీపీఐ ఆధ్వర్యంలో శనివారం జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సీపీఐ నాయకుడు కాసా రాంబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకమని చెప్పారని గుర్తుచేశారు. ప్రజలపై విద్యుత్ భారాలు పెరుగుతాయన్నారు. ఆదానీ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలన్నారు.