కుత్బుల్లాపూర్: సుచిత్రలో కోర్టు కేసులో ఉన్న స్థలంలో ఫెన్సింగ్ ఏర్పాటుపై ఘర్షణ, మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సుచిత్ర వద్ద ఓ వివాదాస్పద స్థలం లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి కి సంబంధించిన వివాదాస్పద స్థలం లో కొంతమంది ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందడంతో సైట్ వద్దకు వెళ్ళారు మల్లారెడ్డి. మల్లారెడ్డి, ఆయన అల్లుడు సైట్ వద్దకు రావడం తో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎంత సర్ది చెప్పిన వినకపోవడంతో మల్లారెడ్డి ని అరెస్టు చేశారు పోలీసులు