మఖ్తల్: నర్వ ఇంటర్ ఫలితాలు మెరిసిన దళిత ఆణిముత్యం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో ఎందరో విద్యార్థులు ఉత్తమ మార్కులతో తమ సత్తా చాటారు. నర్వ మండలంలోని రైకోడ్ గ్రామానికి చెందిన నారా వెంకటేష్ కుమారుడు నారా వెంకటస్వామి ఇంటర్మీడియట్ లో అత్యధికంగా 974 మార్కులు సాధించి టాపర్ గా నిలిచాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు తదితరులు అభినందనలు తెలియజేశారు.