జిల్లా పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ సందర్భంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా పోటీలకు సంబంధించి పాల్గొనే జట్లకు అవసరమైన టీ షర్ట్స్, లోయర్లు, క్యాప్‌లు సిద్ధం చేయడం జరిగింది. గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ క్రీడా దుస్తులను జిల్లా ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా అందజేశారు. సబ్ డివిజన్ వారీగా పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లు, క్రీడాకారులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ కేటాయించి, ఆ ప్రకారంగానే దుస్తులు తయారు చేయించగా, వాటిని సంబంధిత సబ్ డివిజన్ల టీం కెప్టెన్లకు ఎస్పీ అందజేశారు.