విశాఖలో డిసెంబరు 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు జరుగుతున్న అఖిలభారత సిఐటియు మహాసభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు సిఐటియు న్యూ సిటీ ఆల్ ట్రేడ్ యూనియన్స్ విస్తృతస్థాయి సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సిఐటియు అఖిలభారత మహాసభలు విశాఖపట్నంలో 2025 డిసెంబర్31 నుండి 2026 జనవరి నాలుగో తేదీ వరకు జరుగుతున్న సిఐటియు మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.