దుబ్బాక: గంభీర్పూర్లో భీమసేన కు మాజీమంత్రి హరీష్ రావు పరామర్శ
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని గంభీర్ పూర్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీమసేన తండ్రి కరికె రాజయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి శనివారం ఆయనను పరామర్శించారు. రాజయ్య చిత్ర పటానికి నివాళి అర్పించి, ప్రగాడ సంతాపం ప్రకటించారు. అలాగే అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నీరటి రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.