మద్దిరాల: మద్దిరాలలో తాటి చెట్టు పైనుండి పడి గీతా కార్మికుడు మృతి
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మద్దిరాల మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలుమల్లకు చెందిన గీత కార్మికుడు తునికి వెంకన్న గౌడ్ (55) రోజువారీగా తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారీ కింద పడటంతో బలంగా గుద్దుకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వీరన్న తెలిపారు.