నగరి: ముడిపల్లి గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
నగరి రూరల్ మండలం ముడిపల్లి గ్రామంలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థికి, ప్రతి పౌరుడికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను మాజీ మంత్రి రోజా వివరించి, ప్రజల నుంచి విస్తృతంగా సంతకాలను సేకరించారు.