సైబర్ నేరాల నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం జిల్లా రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఇటీవల వాట్సప్ గ్రూపులలో నాకు 5000 వచ్చాయి. మీకు వస్తాయి అని చెప్పి కొన్ని లింకులు దర్శనమిచ్చాయని ఇటువంటి లింకులను సైబర్ నేరగాళ్లు పంపుతారని ఎస్ఐ హెచ్చరించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను ఎట్టి పరిస్థితులలో ఓపెన్ చేయవద్దని అలా చేసినట్లయితే మీ నగదు బ్యాంకు ఖాతా నుంచి మాయమయ్య అవకాశం ఉందని అన్నారు. ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.