ఒంగోలు: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా "నో ఆక్సిడెంట్ డే" స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు,
రోడ్డు ప్రమాదల నివారణకు జిల్లా వ్యాప్తంగా శనివారం నో యాక్సిడెంట్ డే స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రజలకు, వాహన చోదకులకు జిల్లా పోలీసులు అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసు అధికారులు మరియు సిబ్బంది కలిసి రోడ్డు భద్రత ప్రమాణాలు, ట్రాఫిక్ నియమాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు, యాక్సిడెంట్ ప్రీ డే సందర్భంగా జాతీయ రహదారిపై రోడ్డు భద్రత, రక్షణ, హెల్మెట్, అతివేగ వంటి విషయాలపై సంకేత బోర్డులతో పోలీసులు అవగాహన కల్పించారు,