రైల్వే బద్రత దృష్ట్యా రాయదుర్గం పట్టణంలోని రైల్వే స్టేషన్ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్ పరిసరాలలో అసాంఘిక కార్యకలాపాలు, రైలు పట్టాలపై రాళ్లు ఉంచడం, ఎక్కడ బడితే అక్కడ మందుబాబుల ఆగడాలు ఎక్కువ కావడంతో వారిని కట్టడి చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇకనుండి గుంతకల్లు జిఆర్పిఎఫ్ పోలీసులు నిరంతర నిఘా కొనసాగనుంది. పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని రైల్వే అధికారులు హెచ్చరించారు.