రేపు ఎల్లుండి శని, ఆదివారాలు రెండు రోజులపాటు నారాయణపేట జిల్లా కేంద్రంలో పిడిఎస్యు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎస్. సాయికుమార్ పిలుపునిచ్చారు. ఈ మూడవ మహా సభలకు విద్యార్థులు విద్యా వేత్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేపు ఉదయం 11 గంటలకు విద్యార్థి ప్రదర్శన ప్రారంభమై మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ సభలకు ముఖ్య అతిథులుగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ముఖ్య వక్తగా పివైఎల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఏం.అన్వేష్ హాజరై ప్రసంగిస్తున్నట్లు తెలిపారు.