ప్రొద్దుటూరు: బంగారు వ్యాపారస్తులకు ఏం జరిగినా పోలీసులదే పూర్తి బాధ్యత
Proddatur, YSR | Nov 25, 2025 ప్రొద్దుటూరులోని నగల వ్యాపారుల అరెస్టు, అక్రమ నిర్బంధం విషయంలో పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ వ్యాపారి వద్ద నుంచి బంగారం కొనుగోలు చేసి డబ్బు ఇవ్వకుండా వ్యాపారిని బెదిరించిన కేసులో ప్రొద్దుటూరుకు చెందిన అన్నదమ్ములు, నగలు వ్యాపారులు శ్రీనివాసులు, వెంకటస్వామి లపై ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 21వ తారీకు పోలీసులు తమను ఎటువంటి సమాచారం లేకుండా కిడ్నాప్ చేసి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఒక రోజంతా పెట్టి చిత్రహింసలు పెట్టారని వ్యాపారులు జడ్జి కి తెలిపారు. దీంతో జడ్జి ప్రైవేటు వైద్యుని వద్దకు పరీక్షల నిమిత్తం వ