ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : కొండగట్టు దేవాలయానికి తరలిన రఘునాథపల్లి మండల హనుమాన్ దీక్ష భక్తులు
రఘునాథపల్లి మండల పరిధికి చెందిన హనుమాన్ భక్తులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇరుముడి కట్టుకొని కొండగట్టు హనుమాన్ ఆలయానికి తరలి వెళ్లారు. మండల కేంద్రంలోని మహాదేవ స్వామి దేవాలయ ప్రాంగణంలో హనుమాన్ దీక్ష భక్తులు ఇరుముడి కట్టుకోగా, భక్తులు జై హనుమాన్ జై జై హనుమాన్ అంటూ ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది .ఆలయ అర్చకులు పిండిప్రోలు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు ఇరుముడి కట్టుకొని కొండగట్టు పుణ్యక్షేత్రానికి తరలి వెళ్లారు.