ఆలూరు: ఆలూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం: ఎంపీడీవో జ్యోతి
Alur, Kurnool | Dec 3, 2025 ఆలూరు నియోజకవర్గం పరిధిలోని అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. వైకల్యం శరీరానికి మాత్రమే కానీ, మనసు, ప్రతిభ, ఆత్మవిశ్వాసానికి అడ్డంకి కాదని పేర్కొన్నారు. ప్రతిభావంతులు తమ హక్కులు, ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకుని మరింత ముందుకు రావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎస్సై సహా పలువురు పాల్గొన్నారు.