నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. చిన్నదేవులాపురం గ్రామానికి చెందిన షేక్ చిన్న వలి భాష మౌలాబి గార్ల కూతురైన నాలుగు సంవత్సరాల జతిస్మా తెలుగుగంగ కాలువ వద్ద ఆడుకుంటూ ప్రమాదవసాత్తు అందులో పడిపోయింది. స్థానికులు గమనించి పాపను బయటకు తీశారు అనంతరం చికిత్స నిమిత్తం వెలుగోడు ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది