కుప్పం: సెరికల్చర్ రైతులకు పనిముట్లు పంపిణీ
శాంతిపురం మండల పరిధిలోని సెరికల్చర్ రైతులకు సబ్సిడీ పనిముట్లను ఏపీ లేబర్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథ నాయుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ పంపిణీ చేశారు. రాష్ట్రంలోని సెరికల్చర్ రైతులకు అవసరమైన పనిముట్లను ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తుందని, రైతులు పట్టుగూళ్ల పెంపకంపై మరింత దృష్టి సారించి అధిక దిగుబడులు పొందాలన్నారు.