చిత్తూరు: సమస్యల పరిష్కారానికి 12న నిరసన అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు సీఐటీయూ, ఏఐటీయూసీ అంగన్వాడీ అనుబంధ సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీకి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నట్టు వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.