ఫరూక్ నగర్: ఫరూఖ్‌నగర్ లో గాలి వాన బీభత్సం.. కుప్పకూలిన ట్రాన్స్ఫార్మర్
ఫరూఖ్‌నగర్ మండలంలో భాయ్ వెంచర్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గాలి వాన బీభత్సంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కుప్పకూలింది. స్తంభం విరిగిపోవడంతో విద్యుత్ వైర్లు నేలకొరిగాయి. దీంతో రైతులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.