బాలిక కు గర్భం చేసి శిశువుకు కారణం అయిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని సీపీఎంజిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. నాగేశ్వర రావు డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శనివారం బాలిక తల్లిదండ్రులతో కలిసి సిపిఎం నాయకులు పాత్రికేయులతో మాట్లాడుతూ గత 2 సం.ల నుండి బాలికను మాయ మాటలతో మోసగించి శారీరకంగా అనుభవిస్తూ బాలిక గర్భం దాల్చి ఆడబిడ్డను ప్రసవించడం జరిగిందని మిడుతూరు మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ చదువుకునేందుకు నందికొట్కూరుకు రోజూ కళాశాలకు వెళ్లి వచ్చేదని నందికొట్కూరు మండలం 10.బొల్లవరం గ్రామానికి చెందిన యువకుడు పదో తరగతి