తాడేపల్లిగూడెం: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) తరపున తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మరపట్ల రాజు.
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) తరపున మరపట్ల రాజు నామినేషన్ దాఖలు చేసినట్లు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మరియు ఆర్డీవో కె.చెన్నయ్య తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు నామినేషన్ పర్వం మూడవరోజు శనివారం ఒక నామినేషన్ దాఖలు కాగా ఇప్పటి వరకు మూడు రోజులకు కలపి మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయని అన్నారు.