మరోసారి దగా పడ్డ అన్నదాత
ఓవైపు అకాల వర్షాలు మరోవైపు నకిలీ విత్తనాల ధాటికి రైతు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాడు. సూళ్లూరుపేట వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలు అందజేసి 60 రోజులకు రావలసిన వెన్ను 20 రోజులకే రావడంతో మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు వ్యాపారులు కొత్తరకం విత్తనాలు అంటూ తమకు ఇచ్చారని 200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.