డి.హిరేహాల్ మండలంలోని ఓబులాపురం గ్రామంలో మురుగునీరు రోడ్లపై నిలచి దుర్గంధం వెదజల్లుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు టిడిపి నేతల సహాకారంతో కాలువల్లో చెత్త తొలగింపు చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి మద్యాహ్నం వరకూ టిడిపి నేత తాయప్ప ఏర్పాటు చేసిన జెసిబి సహాయంతో డ్రైనేజీలకు ఇరువైపులా పెరిగిన ముళ్ళ చెట్లు తొలగించడంతోపాటు డ్రైనేజీ పూడిక కూడా తీయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.