నగరి: నగరి నియోజకవర్గ పరిధిలోని నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలి : సిపిఐ పార్టీ నాయకులు
నగరి నియోజకవర్గ పరిధిలోని నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని నియోజకవర్గ CPI కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం CPI పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు నగరి నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3 మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతామని హామి ఇచ్చినట్లు చెప్పారు. ఆ హామీని నెరవేర్చాలన్నారు.