అనంతపురం జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నూతనంగా నియమింపబడిన వడ్డే వెంకట్ ఆదివారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వడ్డే వెంకట్ ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే కూడా వడ్డే వెంకట్ ను శాలువాతో సత్కరించారు. అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే వెంకట్ కు సూచించారు.