రాయదుర్గం: హుళికల్లు గ్రామానికి చెందిన రైతు పండించిన మిర్చి కి బ్యాడిగి మార్కెట్ లో రికార్డు స్థాయి ధర
డి.హిరేహాల్ మండలం హుళికల్లు గ్రామానికి చెందిన రైతు తలారి పరమేశప్ప పండించిన ఎండు మిర్చి అత్యదిక ధర పలికింది. కర్నాటకలోని బ్యాడిగి మిర్చి యార్డ్ కు తాను పండించిన 10 క్వింటాళ్లు మిర్చిని తీసుకెళ్లాడు. అక్కడ ఈ మిర్చి క్వింటాలుకు రికార్డు స్థాయిలో రూ. 63,199 ల అత్యదిక ధర చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. మంచి నాన్యమైన మిర్చి పంట పండించిన రైతును యార్డు కమిటీ సభ్యులు సత్కరించి అభినందించారు.