ఇటీవల క్రెడిట్ కార్డు యజమానులు తమ లిమిట్ పెంచుతామని చెప్పి ఫోన్లో ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు అడిగే కాల్స్ వస్తున్నాయని వీటి వల్ల భారీగా నష్టాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదివారం రాత్రి 7 గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు. వాస్తవికంగా బ్యాంకులు ఎప్పుడు కూడా ఓటీపీ, పాస్వర్డ్, సీవీవీ వంటి వివరాలు ఫోన్ లో అడగరని గుర్తుంచుకోవాలని,గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే లిమిట్ పెంపు, కార్డ్ అప్ గ్రేడ్ అంటూ వచ్చే కాల్స్ కి స్పందించకండిని, ఎలాంటి లింక్లు, అప్లికేషన్లను డౌన్లోడ్ చేయొద్దుని, ఎవరికి వారి బ్యాంక్ డిటైల్స్, ఓటీపీ, స