తువ్వ పల్లె మోడల్ స్కూల్ విద్యార్థి శశిధర్ రాష్ట్రస్థాయికి ఎంపిక, అభినందించిన ఎమ్మెల్యే అఖిలప్రియ
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని తువ్వ పల్లె మోడల్ స్కూల్ విద్యార్థి శశిధర్ రాష్ట్రస్థాయి సైన్స్ ప్రాజెక్టు పోటీలకు ఎంపికయ్యారు, ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థిని శాలభతో సన్మానించి 5000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు, శశిధర్ మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆకాంక్షించారు, ప్రతిభగల విద్యార్థులలో ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు