ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలను అడ్డుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం సాయంత్రం ఆయన మాకవరపాలెం మండలంలోని భీమ బోయిన పాలెం వద్ద నిలిచిపోయిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.