పూతలపట్టు: చెర్లోపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని అయ్యప్ప స్వామి భక్తుడు మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని అయ్యప్ప స్వామి భక్తుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణం మండలం బెంగళూరు తిరుపతి హైవే చెర్లోపల్లి వద్ద రోడ్డుపై నడిచి వెళుతున్న అయ్యప్ప స్వామి భక్తుడిని మారుతి జెన్ కారు ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని పటేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.