జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో డ్రైనేజీ చెత్తను తొలగించకపోవడంతో కాలనీవాసుల ఇబ్బందులు
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో అధికారుల పర్యవేక్షణ లేమితో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీల నుంచి మురికిని తొలగించి, ఎక్కడికక్కడే చెత్తను వదిలి వేశారు. దీంతో ఆయా కాలనీలు దుర్గంధంతో నిండిపోయాయి. దీనిపై మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలని కాలనీవాసులు కోరుతున్నారు.