ప్రొద్దుటూరు: రాజీవ్ గాంధీ ఏకో పార్కలో కోటిసంతకాల సేకరణ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
Proddatur, YSR | Nov 21, 2025 రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎకో పార్క్ అలాగే అనిబిసెంట్ మున్సిపల్ మైదానం నందు వాకర్స్ చేత సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, మాజీ టౌన్ బ్యాంకు ఉపాధ్యక్షులు అక్రమ్ గౌస్, పలువురు వైసిపి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు.