అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని అనకాపల్లి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు, ఇంటిలో ఎవరూ లేని సమయంలో రెండు ఇళ్లలో తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన పరవాడ మండలానికి చెందిన రాజశేఖర్ అనే నిందితుని అరెస్టు చేసి, అతని వద్ద నుండి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం పట్టణ సిఐ విజయ్ కుమార్ తెలిపారు.