పత్తికొండ: పత్తికొండలో పోలీసులు వాహన తనిఖీ మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు
పత్తికొండ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎస్సై రామదాసు వాహనాల తనిఖీ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇతర వాహన పత్రాలు లేని వాహనాలకు జరిమానా ఆదివారం విధించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే కలిగే నష్టాన్ని భరించడం కష్టమని ఎస్సై వాహనదారులకు వివరించారు. వాహనదారులు సహకరించి వాహన చట్టాలను పాటించాలని, చట్టాలను గౌరవించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.