వీరాంజనేయపల్లి వద్ద బైక్‌పై గ్రామానికి తిరిగి వెళ్తుండగా అదుపు తప్పి గుంతలో పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండలం వీరాంజనేయపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో చెర్లోపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చెర్లోపల్లికి చెందిన ప్రభాకర్, లక్ష్మీపతి ద్విచక్రవాహనంపై గ్రామానికి తిరిగి వెళుతుండగా ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న గోతిలో పడడం జరిగిందని పోలీసులు తెలిపారు. స్థానిక ప్రజలు గమనించి క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో లక్ష్మీపతి ఆర్మీలో పని చేస్తున్నట్లు తెలిపారు.